బెల్లంపల్లిరూరల్, వెలుగు: నాసిరకం భోజనం మాకొద్దని ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ప్రధాన గేట్ ముందు ధర్నా చేపట్టారు. చాలీచాలని పప్పు నీళ్లతో భోజనం వడ్డిస్తున్నారని వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
స్టూడెంట్స్ ధర్నాకు ఏఐఎస్బీ సంఘం నాయకులు, సర్పంచ్కొండగొర్ల గంగారాం మద్దతు తెలిపి ధర్నాలో బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే హాస్టల్ సమస్యలను బయటకు ఎందుకు తెస్తున్నారని స్టూడెంట్స్‌ను బెదిరించారని ఆరోపించారు. స్కూల్‌కు రూ.75 వేల గ్రాంట్ వస్తే ఎలాంటి పనులు చేపట్టలేదని, కనీసం సౌకర్యాలు కానరావడం లేదన్నారు.
డీటీడబ్ల్యూఓ రమాదేవి, ఏటీడబ్ల్యూఓ సురేశ్ధర్నా చేపడుతున్న వారితో ఫోన్లో మాట్లాడి సిబ్బందిపై చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైరి సాయి, వార్డు సభ్యుడు దేవాజీ, స్థానిక యువకులు పాల్గొన్నారు.
